శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 22 జూన్ 2018 (15:31 IST)

మామిడి తాండ్ర తయారీ విధానం...

మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియాలను నశించటకు మామిడి పండు చాలా ఉపయోగపడుతుంది. పంటిపై ఎనామిల్ కూడా దృడంగా ఉం

మామిడి పండును తినడం వల్ల పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు, చిగుళ్ల నుండి రక్తం కారడం వంటి సమస్యలు దూరమవుతాయి. నోటిలోని బ్యాక్టీరియాలను నశించటకు మామిడి పండు చాలా ఉపయోగపడుతుంది. పంటిపై ఎనామిల్ కూడా దృఢంగా ఉంటుంది. మామిడిపండు జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మామిడి పండ్లను తీసుకోవడం వలన సన్నగా ఉన్నవారు సహజవంతమైన బరువు పెరిగే అవకాశం ఉంది.
 
కావలసిన పదార్థాలు:
మామిడిపండు గుజ్జు - 2 కప్పులు
బెల్లం తరుగు - 1 కప్పు
నెయ్యి - కొద్దిగా 
 
తయారీవిధానం
ముందుగా బాణలిలో మామిడపండు గుజ్జు, బెల్లం లేదా చక్కెర వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమం సగానికి వచ్చేంతవరకు సన్నని మంటపై ఉడికించాలి. ఇప్పుడు ఒక పెద్ద ప్లేటు లేదా ప్లాస్టిక్ షీట్ తీసుకుని దానిపై నెయ్యి రాయాలి. నెయ్యి రాసుకున్న తరువాత ఆ మామిడిపండు గుజ్జు మిశ్రమాన్ని ప్లాస్టిక్ షీట్ మీద వేసి బాగా ఆరనివ్వాలి. ఆరిన తరువాత కట్ చేసుకుంటే మామిటి తాండ్ర రెడీ.