పాస్తా తయారీ విధానం...
పాస్తా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని మైదాపిండితో తయారుచేస్తారు. పాస్తాలో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ని మంచి విషయాలు దాగివున్న ఈ పాస్తాతో మీ కోసం ఒక రుచికరమైన వంటకం. అది ఎలా తయారుచేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:
పాస్తా - 100 గ్రాములు
నీళ్ళు - సరిపడా
ఉప్పు - తగినంత
టమాటాకు - 3
ఉల్లిపాయలు - 1/2 కప్పు
కారం - సరిపడా
కరివేపాకు - కొద్దిగా
పోపుదినుసులు - కొద్దిగా
నూనె - సరిపడా
కొత్తిమీర - 1/2 కప్పు
తయారీ విధానం:
ముందుగా బాణలిలో పాస్తా, నీళ్లు, ఉప్పు వేసి బాగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో నూనెను పోసి వేడయ్యాక పోపుదినుసులు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తరువాత ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలను వేసి అందులో కారం కొద్దిగా ఉప్పు వేసి బాగా పచ్చడిగా తయారుచేసుకున్న తరువాత ఆ మిశ్రమంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తాని వేసి కాసేపు వేపాలి. చివరగా పాస్తాలో కొత్తిమీర వేసుకుంటే పాస్తా రెడీ.