బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 27 జూన్ 2018 (10:03 IST)

సమ్మర్ స్పేషల్ కీరాతో వడియాలు తయారీ? ఎలా?

వేసవిలో దొరికే కీరాలో విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కంటికి చల్లదనాన్నిస్తుంది. మరి ఇటువంటి కీరాతో వడియాలు ఎలా తయారుచేయాలో చూద్దాం.

వేసవిలో దొరికే కీరాలో విటమిన్స్, ప్రోటీన్స్, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. కంటికి చల్లదనాన్నిస్తుంది. మరి ఇటువంటి కీరాతో వడియాలు ఎలా తయారుచేయాలో చూద్దాం.
 
కావాలసిన పదార్థాలు:
మినపప్పు- 250 గ్రాములు (రాత్రి నానబెట్టాలి) 
కీర- 1 కిలో (లోపల గింజలు ఉండేవి) 
బ్లాక్‌ పెప్పర్‌ - 25 గ్రాములు 
జీలకర్ర - తగినంత 
నల్ల ఏలకులు- 5-6
 
తయారీ విధానం:
ముందుగా మినపప్పును కనీసం నాలుగు గంటల పాటు నీళ్లల్లో నానబెట్టాలి. కీరాను తొక్క తీసి తురమాలి. వాటిల్లోని విత్తనాలను విడిగా తీసి పెట్టుకోవాలి. తురిమిన కీరాను పిండి ఆ జ్యూసును విడిగా ఒక గిన్నెలోకి పోయాలి. ఇప్పులు మినపప్పు, ఇతర పదార్థాలతోపాటు కొన్ని కీరా నీళ్లను కూడా మినపప్పులో పోసి పిండి చిక్కగా అయ్యేవరకూ రుబ్బాలి.

కీరా తురుము, గింజలు రెండింటినీ ఆ పిండిలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక వెదురు చాపమీద పెద్ద నేత గుడ్డ పరిచి రుబ్బిన పిండిని ఒక్కొక్క చెంచా గుడ్డ మీద పెట్టుకుంటూ వెళ్లాలి. మూడు లేదా నాలుగు రోజుల పాటు వీటిని ఎండలో ఉంచితే బాగా ఎండుతాయి. ఈ వడియాలు సగం ఎండిన తర్వాత గుడ్డ నుంచి తీసి ఎండబెట్టాలి. అలా బాగా ఎండిన వడియాలను గాలి సోకని డబ్బాలో పెట్టాలి. అంతే కీరా వడియాలు సమ్మర్‌ రెసిపీ రెడీ.