Webdunia - Bharat's app for daily news and videos

Install App

చదివే పిల్లలకు రాగి జావ ఇస్తే..?

దీర్ఘకాల అజీర్తి సమస్యలను పరిష్కరించే శక్తి రాగులకు వుంది. రాగుల్లో ఇనుము శాతం ఎక్కువ. దీనిలోని ప్రధాన పోషకాలైన ప్రొలామిన్స్, అమినో ఆమ్లాలు, విటమిన్ బి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగిపిండితో రొట్

Written By selvi
Updated: బుధవారం, 13 జూన్ 2018 (14:28 IST)
దీర్ఘకాల అజీర్తి సమస్యలను పరిష్కరించే శక్తి రాగులకు వుంది. రాగుల్లో ఇనుము శాతం ఎక్కువ. దీనిలోని ప్రధాన పోషకాలైన ప్రొలామిన్స్, అమినో ఆమ్లాలు, విటమిన్ బి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రాగిపిండితో రొట్టెలు, దోశ, పుట్టు, జావ తయారు చేసుకోవచ్చు. దీన్ని పాలు లేదా పెరుగుతో కలిసి తీసుకుంటే పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చదువుకునే పిల్లలకు రాగులను నిత్యం ఏదో ఒక రూపంలో ఇవ్వడం ద్వారా మెదడు చురుగ్గా వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే అజీర్ణ సమస్యలు తొలగిపోవాలంటే సొరకాయను వంటల్లో చేర్చాలి. బీపీ, కాలేయ సమస్యలు వున్నవారికి సొరకాయ ఎంతో మేలు చేస్తుంది. సొరకాయ రసంలో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి నిత్సం తీసుకుంటే మూత్ర సంబంధిత రోగాలను దూరం చేసుకోవచ్చు. 
 
ఇకపోతే.. పిల్లలకు గుమ్మడి గింజలను ఇవ్వడం ద్వారా హృద్రోగ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కంటిచూపుకు గుమ్మడి గింజల ద్వారా కలిగే మేలు అంతా ఇంతా కాదు. అరకప్పు గుమ్మడి ముక్కలను రోజూ ఆహారంలో చేర్చుకుంటే.. విటమిన్ సి, ఇ సమృద్ధిగా లభిస్తుంది. వేయించిన గుమ్మడి గింజలను పిల్లల స్నాక్స్ డబ్బాలో నింపడం చేస్తే పిల్లల్లో ఏర్పడే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. 

అన్నీ చూడండి

మహిళతో వివాహేతర సంబంధం - రూ.29 కోట్ల నిధుల దుర్వినియోగం - అరెస్టు

ఖైరతాబాద్ గణేశుడికి గవర్నర్ తొలి పూజ... సీఎం చంద్రబాబు నివాసంలో చవితి వేడుకలు

మద్యం మత్తులో మహిళా బైకరును వేధించిన అకతాయిలు..

ఖైరతాబాద్‌లో కొలువైన పంచముఖ సంకటహర మహాగణపతి

అస్సోంలో ఫుట్‌బాల్ ఆడిన అడవి ఏనుగు - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments