మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (13:20 IST)

మైదాపిండి తీసుకుంటే మధుమేహం తప్పదు...

మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను తింటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారుచేస్తారు. వాటిలో కలిపే రసాయనాల ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. ఈ పిండిలో కార్బోహ

మైదాపిండితో చేసే ఆహార పదార్థాలను తింటే మధుమేహం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైదాపిండిని గోధుమల నుంచి తయారుచేస్తారు. వాటిలో కలిపే రసాయనాల ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. ఈ పిండి కార్బోహైడ్రేట్లను అధిక స్థాయిలో కలిగి ఉంటుంది. పోషకాలు కూడా చాలా తక్కువ మోతాదులో ఉంటాయి.
 
తద్వారా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు తప్పవు. మైదాపిండి తయారీలో భాగంగా అందులో కలిపే ఫోలిక్ యాసిడ్ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉంది. మైదాపిండిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి శరీర కణాలకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హానికరమైన ప్రభావాలను కలుగజేసే అల్లాక్సాన్ మైదాలో ఎక్కువగా ఉంటుంది.
 
మైదాను ఉపయోగించి చేసే పిజ్జా, కుకీస్, పాస్తా, ఫాస్ట్‌ఫుడ్స్ తీసుకోకపోవడమే ఆరోగ్యానికి మంచిది. ఎందుకుంటే ఇందులో అవశ్యం లేని అమైనో ఆమ్లాన్ని కలుపుతున్నారు. దీనివల్ల మధుమేహం వ్యాధికి గురికానున్నారు. క్యాన్సర్ వ్యాధికి కూడా ఈ మైదాపిండి చాలా ఎక్కువగా దోహదపడుతుంది. కాబట్టి ఆరోగ్యానికి తగుజాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును.