శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : మంగళవారం, 12 జూన్ 2018 (17:08 IST)

బీరకాయ పచ్చడి తయారీ విధానం...

బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసుకుంటే.. అస్సలు దాన్ని వదిలిపెట్టరు. సాధారణ, నేతి బీరకాయ రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌ సి, జింక్‌, ఐరన్‌, మెగ్నీషియం, థైమీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలో

బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసుకుంటే.. అస్సలు దాన్ని వదిలిపెట్టరు. సాధారణ, నేతి బీరకాయ రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌ సి, జింక్‌, ఐరన్‌, మెగ్నీషియం, థైమీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలోని పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ రక్తంలోని, యూరిన్‌లోని చక్కెర నిల్వల శాతాన్ని చాలామటుకు తగ్గించేందుకు తోడ్పడతాయి. 
 
కావలసిన పదార్థాలు :
బీరకాయలు - 4
కొత్తిమీర తరుగు - 1 కప్పు
పచ్చిమిర్చి- 6
శనగపప్పు, మినప్పప్పు - ఒక్కొక్క స్పూన్
జీలకర్ర - 1/2 స్పూన్
నువ్వులు - 1 స్పూన్
నిమ్మరసం - 3 స్పూన్స్
నూనె - సరిపడా
ఆవాలు, జీలకర్ర - 1 స్పూన్
ఎండుమిర్చి - నాలుగు
ఇంగువ - 1 స్పూన్
కరివేపాకు - 3 రెమ్మలు
 
తయారీ విధానం :
బాణలిలో నూనెను వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో నువ్వులను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి వేసి ఐదునిమిషాల పాటు వేయించాలి. అదే బాణలిలో నూనెను వేసి బీరకాయ ముక్కలను ఐదు నిమిషాలపాటు బాగా వేయించి దించి చల్లార్చాలి.
 
ఇప్పుడు వేయించిన శనగపప్పు, మినప్పప్పు, జీలకర్రలను గ్రైండ్ చేయాలి. ఆ తరువాత నువ్వులను పొడిచేసి అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, వేయించిన బీరకాయ ముక్కలను వేసి గ్రైండ్ చేయాలి. బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేసి కొన్ని నిమిషాలు వేయించాలి. మంట తీసివేసి ఈ పోపును గ్రైండ్ చేసిన మిశ్రమంలో కలుపుకుంటే బీరకాయ పచ్చడి రెడీ.