శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. శాకాహారం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 13 జూన్ 2018 (13:20 IST)

పొటాటో రైస్ తయారీ విధానం...

బంగాళాదుంపలో పొటాషియం బీ6 నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. విటమిన్ బి6 ఒత్తిడిని దూరం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను సక్రమంగా ఉంచుతుంది. తద్వారా నరాలకు, మెదడుకు రక్తప్రసరణ క్రమంగా జరుగుతుంది. ఇంద

బంగాళాదుంపలో పొటాషియం బీ6 నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. విటమిన్ బి6 ఒత్తిడిని దూరం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను సక్రమంగా ఉంచుతుంది. తద్వారా నరాలకు, మెదడుకు రక్తప్రసరణ క్రమంగా జరుగుతుంది. ఇందులోని విటమిన్ సి ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఇటువంటి బంగాళాదుంపతో ఆరోగ్య వంటకం ఎలా చేయాలో తెలుసుకుందాం.
 
కావలసిన పదార్థాలు:
బంగాళాదుంపలు - 5 
ఉప్పు - సరిపడా
కారం - తగినంత
నూనె - సరిపడా
అన్నం - 1 కప్పు
టమాటా - 1/2 కప్పు
కరివేపాకు - 2 రెప్పులు
పోపుదినుసులు - సరిపడా
పసుపు - కొద్దిగా
 
తయారీ విధానం:
ముందుగా బంగాళాదుంపలను చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని బాగా కడిగేసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలలో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. బాణలిలో నూనెను పోసి వేడైయాకా బంగాళాదుంపలు వేసి వేగనివ్వాలి. వేగిన తరువాత వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాణలిలో నూనె కాస్త తీసి పోపుదినుసులు, కరివేపాకు వేగాకా అందులో టమాటా ముక్కలు వేసి అందులో కాస్త ఉప్పు, కారం వేసి బాగా కలుపుకుని ముందుగా వేయించిన బంగాళాదుంపలు అందులో వేసి కాసేపు వేయించి తీసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నం తీసుకుని ఒక బౌల్‌లో వేసి మనం తయారు చేసుకున్న ఆ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అంతే పొటాటో రైస్ రెడీ.