గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. తారల ఫోటో గ్యాలెరీ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 3 అక్టోబరు 2022 (17:44 IST)

మాజీ మిస్ ఆంధ్రప్రదేశ్ నందినిరాయ్ మోడ్రన్ ఔట్‌ఫిట్ ఫోటోలు

Nandini rai
కర్టెసి-ట్విట్టర్
నీలం గౌహ్రానీ అసలు పేరు, వెండితెర పేరు నందిని రాయ్. ప్రస్తుతం నారింజ రంగు ఔట్ ఫిట్ ఫోటోలను షేర్ చేసింది. నందినిరాయ్ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ నారింజ మిఠాయి అంటున్నారు. నందిని సింధీ కుటుంబానికి చెందిన యువతి.
 
హైదరాబాదులోని సెయింట్ ఆల్బన్స్ హై స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. 2005లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసి మోడలింగ్, నటనపై దృష్టి సారించింది. 80కి పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఆమె 2008లో మిస్ హైదరాబాద్ అవార్డు గెలుచుకుంది.
 
Nandini rai
2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ అవార్డు కైవసం చేసుకుంది. మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2009 దక్కించుకుంది. మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2010 అవార్డు చేజిక్కించుకుంది. హిందీ చిత్రం ఫ్యామిలీ ప్యాక్, తెలుగు చిత్రం మాయలో నటించింది. ఇంకా పలు చిత్రాలకు సంతకాలు చేసి బిజిబిజీగా వుంది.