శనివారం, 2 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 8 అక్టోబరు 2014 (18:54 IST)

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ద్రాక్షరసం తాగండి!

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ద్రాక్షరసం తాగండి అంటున్నారు.. ఆరోగ్యనిపుణులు. ద్రాక్షల్లోని ఫ్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ద్రాక్షలోని టీరోస్టిల్‌బీన్ అనే పదార్థం రక్తంలోని కొలెస్ట్రాల్‌ మోతాను తగ్గిస్తుంది. తద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవడం, ఆస్తమాను అదుపు చేయడం సులభతరం అవుతాయి. 
 
అంతేకాకుండా ద్రాక్షపండ్లు రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ మోతాదును పెంచుతాయి. నైట్రిక్ ఆక్సైడ్ రక్తం గడ్డలుగా ఏర్పడకుండా ఇది నివారిస్తుంది. ఫలితంగా గుండెపోటు, హృద్రోగ సమస్యలు తగ్గుతాయి. 
 
ద్రాక్షలకు ఉన్న యాంటి ఆక్సిడెంట్ లక్షణాలు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సీకరణ చర్యలను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. దాని వల్ల రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.