సంబంధిత వార్తలు
- తేజస్ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలుకు సై : సీసీఎస్
- సముద్రపు చేపలా.. చెరువుల్లో పెంచిన చేపలా.. ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- సీఎం జగన్ మెచ్చిన మహిళా నేతకు గూడు లేదు... ఎందుకని?
- జెల్లీ ఫిష్‌ల దాడి.. బెంబేలెత్తిపోయిన పర్యాటకులు... 90 మంది గాయాలు..
- కరోనా కేంద్రంగా మారిన క్లస్టర్.. 66 మంది భారతీయులకు పాజిటివ్
ఎలాంటి చేపలు కొనాలి? తెలుసుకోవడం ఎలా?
సహజంగా చేపలను మార్కెట్లలో కొంటుంటాం. కానీ కొన్నిసార్లు కొంతమంది బాగా నిల్వచేసిన చేపలను అమ్ముతుంటారు. అలాంటివి తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. మరి చేపలు తాజాగా వున్నాయని తెలుసుకోవడం ఎలా?
చేపలను పట్టే జాలర్ల వద్ద చేపలను కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు చెపుతున్నారు. అలా కాకుండా మార్కెట్లకు వెళ్లినప్పుడు చేపలు తాజాగా వున్నాయా లేదా అని చెక్ చేసుకోవచ్చు. చేపల మొప్పలను తీసి పరిశీలించవచ్చు. అవి ఎర్రగా వుండాలి. అలాగే చేపను చేతితో కాస్త నొక్కి చూస్తే మెత్తగా మీరు వేలు పెట్టినచోట గుంత పడుతుంటే అది బాగా నిల్వ వున్న చేప అని అర్థం చేసుకోవాలి.
చేపలు పట్టుకున్న తర్వాత ఐదు రోజులు తినదగినవిగా ఉంటాయి, కానీ అవి తాజాగా రుచిని కోల్పోతాయి. అందుకే చేపలు పట్టుకున్న వెంటనే ఐసులో పెట్టాలి. అలా పెట్టిన చేపలు డెలివరీ ద్వారా మార్కెట్‌కు అలాగే తేబడాలి. అప్పుడే అవి తాజాగా వుంటాయి.
ఇకపోతే చేపకు దుర్వాసన తీవ్రంగా ఉంటే అది తాజా చేప కాదు. తాజా చేపలు సముద్రపు నీటి వాసన వస్తుంటాయి. ఈ వాసనతోనే అవి తాజా చేపలను గుర్తించవచ్చు. కనుక ఈ టిప్స్ ద్వారా చేపలను తాజావి కొనుగోలు చేస్తే వండిన కూర కూడా రుచిగా వుంటుంది.
తర్వాతి కథనం
