గురువారం, 14 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 నవంబరు 2020 (15:01 IST)

జెల్లీ ఫిష్‌ల దాడి.. బెంబేలెత్తిపోయిన పర్యాటకులు... 90 మంది గాయాలు..

దేశంలోని ప్రముఖ సముద్ర పర్యాటక ప్రాంతాల్లో గోవా ఒకటి. ఈ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చిన పర్యాటకులపై గత రెండు రోజులుగా జెల్లీ ఫిష్‌లు గుంపులు గుంపులుగా చేరి దాడి చేస్తున్నాయి. దీంతో పర్యాటకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ జెల్లీ ఫిష్‌ల దాడుల్లో ఇప్పటివరకూ 90 మందికి‌పైగా గాయపడ్డారని గోవా బీచ్ లైఫ్ గార్డ్ ఏజన్సీ వెల్లడించింది.
 
బగా - కలంగూటే బీచ్‌లో దాదాపు 55 మంది, కండోలిమ్ - సింకెరిమ్ బీచ్‌లో 10 మంది, దక్షిణ గోవా బీచ్‌లో 25 మంది జెల్లీ చేపల బారిన పడ్డారని ఏజెన్సీ తెలిపింది. గుంపులుగా వస్తున్న ఇవి, సముద్రంలోకి వెళ్లే పర్యాటకులపై దాడులు చేస్తున్నాయని వెల్లడించింది. 
 
గాయపడిన పర్యాటకులకు ఎప్పటికప్పుడు ప్రాథమిక చికిత్స అందించామని తెలిపింది. అదేసమయంలో ఈ చేపలు ఎక్కువగా సంచరించే బీచ్ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశామని గోవా పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు.