శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శుక్రవారం, 31 జులై 2020 (18:29 IST)

ఏపీలో లక్షా 40 వేల పాజిటివ్ కేసులు: క్వారంటైన్ సెంటర్లలో క్రీడలు, సంగీతంతో కరోనా థెరఫీ

దేశంలో అత్యధిక కేసులున్న టాప్ 5 రాష్ట్రాలలో ఏపీ కూడా ఒకటి. ఏపీలో ఇప్పటివరకు లక్షా 40 వేల పాజిటివ్ కేసులున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా గ్రామీణ ప్రాంతాలలో భారీ కేసులు వస్తున్నాయి. ఇక అసలు విషయాన్ని పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్నది.
 
నిత్యం వందల కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కరోనా రోగులకు ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు వారిని నిత్యం ఉల్లాసంగా ఉంచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా వారికి క్రీడలు, సంగీతం వంటి వాటితో కరోనా థెరఫీ అందిస్తున్నారు.
 
ఉదయం శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంతో ప్రారంభించి ఆపై రోగులకు తమకు ఇష్టమైన పాటలు వినే సదుపాయం కల్పించారు. అంతేకాకుండా క్వారంటైన్ కేంద్రాలలో క్రీడలకు సంబంధించిన అన్ని రకాల ఉపకరణాలు అందుబాటులో ఉంచారు. వాలీబాల్, బ్యాడ్‌మింటన్, క్యారమ్ ఇలా క్రీడలతో అనంతపురం జిల్లా కోవిడ్ క్వారంటైన్ కేంద్రాలు సందడిగా మారాయి.