గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (14:38 IST)

డా.ఆంథోనీ ఫాసీకి కొవిడ్ పాజిటివ్: జో-బైడన్‌కు సీనియర్ అడ్వైజర్‌గా..

Anthony Fauci
Anthony Fauci
డా.ఆంథోనీ ఫాసీకి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. 81సంవత్సరాల వయస్సున్న ఫాసీ..కోవిడ్ మహమ్మారి అంశంలో అమెరికా ప్రెసిడెంట్‌కు సీనియర్ అడ్వైజర్‌గా వ్యవహరించారు. 
 
81సంవత్సరాల వయస్సున్న ఫాసీ.. ప్రెసిడెంట్ జో బైడెన్, ఇతర సీనియర్ అధికారులతో కొద్దిరోజులుగా కాంటాక్ట్ లో లేరని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియెస్ డిసీజెస్ వెల్లడించింది.
 
తేలికపాటి లక్షణాలు కనిపించడంతో ఫాసీకి ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించామని, ఫలితం పాజిటివ్ వచ్చిందని స్పష్టం చేశారు. అతను పూర్తి డోసు వేసుకోవడంతో పాటు రెండు బూస్టర్ డోసులు కూడా తీసుకున్నట్లు NIAID పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఫైజర్ యాంటీవైరల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలిపారు.
 
జూన్ 11న వార్సిస్టర్ లోని కాలేజ్ ఆఫ్‌ ద హోలీ క్రాస్ కాలేజీకి వెళ్లిన ఫాసీ.. దాని పేరు మార్పు చేస్తూ సైన్స్ సెంటర్ ద ఆంథోనీ ఎస్. ఫాసీ ఇంటిగ్రేటెడ్ సైన్స్ కాంప్లెక్స్ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోల్లో మాస్క్ ధరించలేదని స్పష్టంగా తెలుస్తుంది.