సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (22:54 IST)

అంతర్జాతీయ బాధ్యతలను మనిద్దరం భుజానికెత్తుకుందాం: బైడెన్‌తో జిన్‌పింగ్

ఉక్రెయిన్ పైన రష్యా దాడి సాగుతూ వుంది. ప్రపంచ దేశాలు ఎన్ని చెప్పినా రష్యా వెనక్కి తగ్గడంలేదు. ఇరువైపులా భారీగా ప్రాణ నష్టం జరుగుతోంది. ఐనా పుతిన్ ముందుకు వెళుతున్నారు.

 
ఈ నేపధ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అమెరికా అధ్యక్షుడితో వీడియో కాల్ చేసి మాట్లాడారు. ఉక్రెయిన్ దేశంలో జరుగుతున్న పరిణామాల వల్ల ఎవరికీ ప్రయోజనం వుండవనీ, ఘర్షణ వల్ల దేశాల మధ్య సామరస్య వాతావరణం దెబ్బతినడమే కాకుండా పురోభివృద్ధి కుంటుబడుతుందని వ్యాఖ్యానించారు.

 
అంతర్జాతీయ బాధ్యతలను తమ రెండు దేశాలు భుజానికెత్తుకుని ప్రపంచ శాంతి కోసం ప్రయత్నం చేయాలని చైనా అధ్యక్షుడు బైడన్‌తో అన్నట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలియజేసింది.