శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 28 మే 2021 (15:02 IST)

తల్లికి కరోనా నెగటివ్, బిడ్డకు కరోనా పాజిటివ్

కోవిడ్ నెగెటివ్ తల్లికి పుట్టిన బిడ్డకు కరోనా పాజిటివ్ వచ్చింది. మే 24న బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలోని ఎస్ఎస్ఎల్ ఆసుపత్రిలో చేరినప్పుడు ప్రసవానికి ముందు 26 ఏళ్ల తల్లి కరోనావైరస్ పరీక్షలు చేయగా ఆమెకి నెగటివ్ వచ్చింది. మే 25న, ఆ మహిళ కరోనావైరస్ పాజిటివ్ వున్న ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
 
తల్లికి నెగటివ్ అని వచ్చినప్పటికీ పుట్టిన బిడ్డకు పాజిటివ్ వచ్చింది. బిడ్డకు కోవిడ్ పాజిటివ్ కావడంతో కుటుంబం, వైద్యులు షాక్ అవుతున్నారు. కొద్దిరోజుల్లో ఇద్దరిని మళ్లీ పరీక్షించనున్నట్లు బీహెచ్‌యూ ఆసుపత్రి తెలిపింది. ఎస్‌ఎస్‌ఎల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ.... ఇది అసాధారణమైన సంఘటన కాదని అన్నారు.
 
తల్లి, బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు. ఆర్టీ-పిసిఆర్ పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామని వారణాసి చీఫ్ మెడికల్ ఆఫీసర్ బి.బి.సింగ్ తెలిపారు.