శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 అక్టోబరు 2020 (11:30 IST)

దేశంలో 24 గంటల్లో కొత్తగా 54,044 కోవిడ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. భారత్‌లో అనూహ్యంగా మంగళవారం రోజు 50 వేల దిగవకు పడిపోయిన రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు.. ఇప్పుడు మళ్లీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో కొత్తగా 54,044 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇక, మృతుల సంఖ్య కూడా పెరిగి తాజాగా 717 మంది మృతి చెందారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 76 లక్షల మార్క్‌ కూడా క్రాస్ చేసి 76,51,108కు చేరగా.. ఇప్పటి వరకు 1,15,914 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,40,090 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 
 
మరోవైపు కరోనాబారినపడినవారు గత 24 గంటల్లో 61,775 మంది కోలుకోగా... ఇప్పటి వరకు రికవరీ అయినవారి సంఖ్య 67,95,103కు పెరిగింది.. దేశంలో 88.81 శాతం కరోనా రోగుల రికవరీ రేటు ఉండగా... యాక్టివ్ కేసులు 9.67 శాతంగా ఉన్నాయి.. మరణాల రేటు 1.51 శాతానికి తగ్గిపోయింది.. ఇక, మంగళవారం రోజు దేశవ్యాప్తంగా 10,83,608 శాంపిల్స్ పరీక్షించామని... టెస్ట్‌ల సంఖ్య 9,72,00,379కు చేరినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.