శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 11 డిశెంబరు 2020 (16:53 IST)

ఏపీలో తగ్గిన కరోనా.. కొత్తగా 538 కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒకప్పుడు రాష్ట్రాన్ని వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఏపీలో కొత్తగా 538 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి ఏపీలో 8,74,515కి కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. ఇప్పటివరకు కరోనాతో 7,049 మంది మృతి చెందారు. 
 
ప్రస్తుతం ఏపీలో 5,236 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,62,230 మంది రికవరీ అయ్యారు. కొత్తగా విశాఖలో కరోనాతో ఒకరు మృతి చెందారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టిందని అ జాగ్రత్తగా ఉండకూడదని వైద్యులు చెప్తున్నారు. మాస్క్‌లు శానిటైజర్లు తప్పకుండా వాడాలని సూచిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యులు చెప్తున్నారు.