శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 మే 2020 (14:10 IST)

ఏపీలో కొత్తగా 58 పాజిటివ్‌లు - మొత్తం కేసులు 1583

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా మరో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1583కు చేరాయి. గత కొన్ని రోజులుగా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెల్సిందే. 
 
తాజాగా రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,534 శాంపిళ్లను పరీక్షించగా 58 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,583గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 488 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని వివరించింది.
 
ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,062గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 7, చిత్తూరులో 1, గుంటూరులో 11, కృష్ణాలో 8, కర్నూలులో 30, నెల్లూరులో 1 కేసు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కర్నూలులో మొత్తం కేసులు 466కి చేరాయి. 
 
ఇక జిల్లాల వారీగా మొత్తం కరోనా కేసుల సంఖ్యను పరిశీలిస్తే, అనంతపురం 78, చిత్తూరు 44, ఈస్ట్ గోదావరి 45, గుంటూరు 319, కడప 83, కృష్ణ 266, కర్నూలు 466, నెల్లూరు 91, ప్రకాశం 61, శ్రీకాకుళం 5, విశాఖపట్టణఁ 29, విజయనగరం 0, వెస్ట్ గోదావరి 59 చొప్పున కేసులు నమోదైవున్నాయి. 
 
మరణాల్లో రికార్డు.. 
మరోవైపు, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో భారత్‌లో ఇప్పటివరకు ఏ రోజూ నమోదు కానంత అధికంగా మృతుల సంఖ్య నమోదైంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 83 మంది చనిపోయారు. అదేసమయంలో 2,644 కేసులు నమోదయ్యాయి. భారత్‌లో ఇప్పటివరకు ఒక్కరోజులో ఇన్ని అత్యధిక కేసులు, మృతుల సంఖ్య నమోదు కాలేదు.
 
దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 1,301కి చేరింది. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 39,980కు చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి 10,633  మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 28,046  మంది చికిత్స పొందుతున్నారు.
 
మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసుల సంఖ్య 12,296కి చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 521 మంది మృతి చెందారు. 2,000 మంది కోలుకున్నారు.
 
అలాగే, గుజరాత్‌లో అత్యధికంగా 5,054 మందికి కరోనా సోకగా 262 మంది మృతి చెందారు. 896 మంది కోలుకున్నారు. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 4,122కి చేరింది. 1,256 మంది కోలుకోగా, 64 మంది మృతి చెందారు.
 
మధ్యప్రదేశ్‌లో 2,846 కేసులు నమోదు కాగా, 151 మంది ప్రాణాలు కోల్పోయారు. 624 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తమిళనాడులో 2,757 మందికి కరోనా సోకగా 1,341 మంది కోలుకున్నారు. 29 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
రాజస్థాన్‌లో 2,770 మందికి కరోనా సోకగా 1,121 మంది కోలుకున్నారు.. 65 మంది మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్‌లో 2,487 మందికి కరోనా సోకగా వారిలో 689 మంది కోలుకున్నారు.. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. కేరళలో 499 మొత్తం మందికి కరోనా సోకింది.