సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 21 జులై 2020 (17:57 IST)

ఏపీలో కొత్త కరోనావైరస్ కేసులు-4944, కోలుకున్నవారు-1232

ఆంధ్రను కరోనావైరస్ వణికిస్తోంది. ప్రతిరోజూ నాలుగువేలకు తగ్గకుండా కోవిడ్ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో మొత్తం 37, 162 శాంపిల్స్ పరీక్షించగా అందులో 4,944 కరోనావైరస్ పాజిటివ్ అని తేలింది.
 
కాగా 1232 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేయబడ్డారు. కోవిడ్ కారణంగా అధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది మృతి చెందారు. విశాఖలో 9, చిత్తూరులో 8, శ్రీకాకుళం 7, అనంతపురం 6, పశ్చిమగోదావరి జిల్లాలో 6, గుంటూరులో 5, ప్రకాశంలో 5, కర్నూలులో 4, కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా కారణంగా మృతి చెందారు.