వాడిన బ్రష్‌నే మళ్లీ వాడకూడదట.. టూత్ బ్రష్‌లో 72 గంటల పాటు కరోనా..?
కరోనా బారిన పడిన వారు కరోనా సమయంలో వాడిన బ్రష్ మళ్లీ వాడితే మరోసారి కరోనా బారినపడే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. బ్రెజిల్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో టూత్ బ్రష్‌ల వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలను దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మొదటి సారి కరోనా సోకిన సమయంలో వాడిన బ్రష్ ను పడేయకుండా వాడటం వలన కొందరు రెండవసారి కరోనా బారినపడినట్లు అధ్యయనాల్లో తేలింది. టూత్ బ్రష్‌లో 72 గంటల పాటు కరోనా సజీవంగా ఉంటుందని పరిశోధకులు తెలిపారు.
కరోనా సోకిన వ్యక్తి 14 రోజుల తర్వాత తన పాత బ్రష్ ను పక్కకు పడేసి కొత్త టూత్ బ్రష్ వాడాలని చెబుతున్నారు. అంతే కాదు కరోనా పేషెంట్ వాడే వస్తువుల పక్కన ఇతరుల వస్తువులు పెడితే వారికి కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని తేల్చారు.
వాష్‌రూమ్‌ల్లో ఇతర కుటుంబ సభ్యుల టూత్ బ్రష్‌లు, టంగ్‌క్లీనర్లు, టూత్ పేస్ట్‌లతో పాటు ఇతర టాయిలెట్ వస్తువులు/సామగ్రిని ఉంచకూడదని సూచిస్తున్నారు.
కోవిడ్ బాధితులు నోటి శుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని. నోటిలో వైరస్/బ్యాక్టీరియా నివారణకు గోరు వెచ్చటి ఉప్పునీటిని పుక్కిలించాలని దంతవైద్యులు చెబుతున్నారు.