మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (12:01 IST)

భారత్‌లో కరోనా అప్డేట్.. 94మంది మృతి

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 11,067 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 94 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,08,58,371 కు చేరుకుంది. 
 
ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,55,252 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,41,511 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,05,61,608 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
 
ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 94 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,55,252 కి చేరింది.