తెలుగు రాష్ట్రాల్లో కరోనా అప్డేట్.. ఏపీలో 70, తెలంగాణలో 149 కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 115 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,555 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. 8,80,478 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 917 మంది చికిత్స పొందుతున్నారు.
వైరస్ ప్రభావంతో నేటివరకు 7,160 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో వెల్లడించింది. ఏపీలో ఇవాళ 26, 844 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. నేటివరకు 1,33,94,460 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.
అలాగే గత 24 గంటల్లో తెలంగాణలో 31,834 కరోనా పరీక్షలు నిర్వహించగా 149 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 186 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,831కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,92,415 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,612కి పెరిగింది.