తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం దిశగా టీమిండియా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో దారుణ పరాజయం దిశగా అడుగులు వేస్తోంది టీమిండియా. చివరి రోజు తొలి సెషన్‌లో మిడిలార్డర్ పేకమేడలా కుప్పకూలింది. దీంతో లంచ్ సమయానికి కోహ్లి సేన 6 వికెట్లకు 144 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ కోహ్లి (45), అశ్విన్ (2) ఉన్నారు. చివరి రోజు ఆండర్సన్ ధాటికి ఇండియన్ టీమ్ వరుసగా వికెట్లు కోల్పోయింది.
గిల్ (50) హాఫ్ సెంచరీ చేయగా.. పుజారా (15), రహానే (0), రిషబ్ పంత్ (11), వాషింగ్టన్ సుందర్ (0) విఫలమయ్యారు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి.. ఒక దశలో లంచ్‌కు ముందే ఆలౌటవుతారా అని అనిపించింది. అయితే కోహ్లి, అశ్విన్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్ 3, లీచ్ 2, బెస్ 1 వికెట్ తీశారు. అయితే మరో రెండు సెషన్ల ఆట మిగిలి ఉండటంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా గట్టెక్కడం అసాధ్యంగానే కనిపిస్తోంది.