Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెరుగుతున్న కోవీడ్ కేసులు.. ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కారణమా?

Written By సెల్వి
Updated: శనివారం, 8 ఏప్రియల్ 2023 (07:34 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. పెరుగుతున్న కేసులకు ఎక్స్‌బీబీ 1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16కు సంబంధించిన కేసులు వందల సంఖ్యలో నమోదైనట్టు ఇండియన్ సార్స్‌కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం తెలిపింది. తాజాగా ఈ వేరియంట్ మరింత బలపడే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 
 
అందుకే అధిక జ్వరం, దగ్గు, జలుబు, కళ్లకు పుసులు, దురద వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. కేసుల పెరుగుదలకు ఎక్స్‌బీబీ 1.16 లేదంటే, ఆర్ట్కురుస్‌‌గా పిలిచే కొత్త వేరియంటే కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత వేరియంట్లలో గుర్తించలేదని.. ఇవి కొత్త వేరియంట్ లక్షణాలేనని చెప్తున్నారు. 
 
గత వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇకపోతే.. ఈ కొత్త సబ్ వేరియంట్ మరీ ప్రమాదకరం కాకపోయినా రూపాంతరం చెంది బలపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య  సంస్థ హెచ్చరిస్తోంది. 

అన్నీ చూడండి

Sushmita Konidela: సుష్మిత కొణిదెల నిర్మించిన జగమే సంగీతం అమెజాన్ లో రాబోతోంది

Chiru 71st birthaday: చిరంజీవి బాస్ ఆఫ్ స్టైల్ అన్న మెహర్ రమేష్ - లివింగ్ లెజెండ్ అన్న థమన్

Suhas and Suri: మండాడి నుంచి సుహాస్ పోస్టర్, ఇంకోవైపు సూరి లవ్ ట్రాక్ విడుదల

Yash: ఓవర్ సీస్ లో భారీగా యశ్... టాక్సిక్ అమ్మకాలు - ఇంగ్లీష్ ట్రైలర్ విడుదల

షావుకారు జానకి తీవ్ర అస్వస్థత - వెంటిలేటర్‌పై చికిత్స!

తర్వాతి కథనం
Show comments