బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (10:56 IST)

భారీగా పెరిగిన క‌రోనా కేసులు.. మ‌ర‌ణాలు: 24 గంటల్లో 2లక్షల కేసులు

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3,60,70,510 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 484,655 మంది మరణించారు. అయితే దేశంలో ప్రస్తుతం 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 3,46,30,536 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 
 
అలాగే కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా​ కేసులు భారీగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో రెండు లక్షలకు చేరువగా కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
1,94,720 మంది కొత్తగా కరోనా బారిన పడగా.. 442 మంది కోవిడ్ మహమ్మారి ధాటికి మరణించారు. మరోవైపు 60,405  మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. కోవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.