సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (11:12 IST)

గడిచిన 24 గంటల్లో భారత్‌లో 45,576 కొత్త కేసులు

భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 45,576 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 89,58,483కి చేరింది. ఇందులో 83,83,602 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,43,303 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
ఇక గడిచిన 24 గంటల్లో భారత్‌లో 585 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,31,578కి చేరింది. గడిచిన 24 గంటల్లో 48,493 మంది డిశ్చార్జ్ అయ్యారు. 
 
గడిచిన 24 గంటల్లో 48,493 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్నవారి సంఖ్య 83,83,603కు పెరిగి రికవరీ రేటు 93.58శాతంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4,43,303 క్రియాశీల కేసులు ఉండగా.. ఆ రేటు 4.95 శాతానికి చేరింది. కొత్తగా 585 మంది కొవిడ్‌కు బలవ్వగా.. మొత్తం మరణాల సంఖ్య 1,31,578కి పెరిగింది. భారత్‌లో మరణాల రేటు 1.47శాతంగా ఉంది.