షాకింగ్ న్యూస్-కరోనా లక్షణాలు నెలలు తరబడి వుంటాయట!

శుక్రవారం, 9 అక్టోబరు 2020 (19:25 IST)
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. కరోనా లక్షణాలు అంత సులభం వదిలిపోవని.. రోజులు గడిచినా.. ఆ లక్షణాలు నెలల తరబడి వుంటున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. రోజులు గడుస్తున్న కొద్ది కొంతమందిలో అనారోగ్యం మరింత తీవ్రమవుతోందని ఆ అధ్యయనం తెలిపింది. క్లినికల్‌ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షన్ జర్నల్‌లో వెల్లడించారు. 
 
కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కూడా చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కూడా ఈ అధ్యయనంలో తేలింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని తమ పరిశోధనలో తేలినట్లు ఓ శాస్త్రవేత్త తెలిపారు.
 
మార్చి నుంచి జూన్ మధ్యలో స్వల్ప నుంచి మోస్తరు స్థాయి లక్షణాలు ఉన్న 150 మందిపై ఈ అధ్యయనం జరిపారు. రుచి, వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, జ్వరం, జలుబు సహా కరోనా లక్షణాల్లో ఏదో ఒకటి వీరిలో కనిపిస్తున్నట్లు గుర్తించారు.
 
ఇందులో 66.66 శాతం మందిలో కరోనా నిర్ధారణ అయిన 60 రోజుల తరువాత కూడా లక్షణాలులేవని.. మిగిలిన 33.33 శాతం మందిలో తొలినాళ్లతో పోలిస్తే ఆరోగ్యం బాగా క్షీణించిందని తెలిపారు. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారిలో లక్షణాలు దీర్ఘకాలం కొనసాగుతాయని అందులో పాల్గొన్న పరిశోధకులు చెప్తున్నారు. 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments