ఒమిక్రాన్ వైరస్‌తో అనారోగ్య సమస్యలు : ఆందోళనలో అధికారులు
కరోనా థర్డ్ వేవ్ సమయంలో అనేక మంది ఒమిక్రాన్ వైరస్ బారినపడి కోలుకున్నారు. ఇలాంటి పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఒమిక్రాన్ కోలుకున్న వారిలో పలువురికి వెన్నుపూస సమస్యలు ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించారు. దీంతో ఏపీ వైద్య శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తులు మధుమేహంతో సహా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డయాబెటిక్ రోగులలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయి. కోవిడ్-19 బారిన పడిన వారిలో 20 శాతం మంది మధుమేహ వ్యాధిబారినపడినట్టు తేలింది. 90 శాతం మంది ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యల బారినపడ్డారు.
చాలా మంది కోవిడ్ కోలుకున్న వ్యక్తులు శరీర నొప్పులు, మోకాళ్ల నొప్పులు, జుట్టు రాలడం, ఇతర చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్టు వైద్య పరిశోధనలో తేలింది. ఒమిక్రాన్ వైరస్ బారినపడిన వారు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని, పండ్లకు బదులు కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.