శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శనివారం, 3 అక్టోబరు 2020 (11:09 IST)

కరోనావైరస్ భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డ రిటైర్డ్ జడ్జి

కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే భయంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు రిటైర్డ్ జడ్జి రామచంద్రా రెడ్డి. మియపూర్ న్యూ సైబర్ హిల్స్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నారు రామచంద్ర రెడ్డి. గత కొంతకాలంగా కరోనా లక్షణాలు వుండడంతో టెస్ట్ చేయించారు.
 
అది పాజిటివ్‌గా తేలడంతో హోమ్ ఐసొలేషన్లో వుంటున్నారు. తన వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులకు కరోనా సోకకూడదనే ఉద్దేశంతో బెడ్రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు రామచంద్రా రెడ్డి.
 
ఈ కారణంగానే తను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మియపూర్ పోలీసులు.