1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 డిశెంబరు 2020 (15:26 IST)

పోలియో చుక్కల్లా.. కరోనా వ్యాక్సిన్ పంపిణీ..

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్ బూత్‌ల మాదిరిగానే వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసి టీకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ కార్డ్ ఆధారంగా 50 ఏళ్ల వయసుపైబడ్డవారిని గుర్తించాలని సూచించింది.

తొలి దశలో కోటి మంది హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తారు. రెండో దశలో రెండు కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లకు మూడో దశలో 50 ఏళ్లు పైబడినవారికి అంతకంటే తక్కువ వయసువారు ఉండి ఇతర రోగాలతో బాధపడుతున్నవారికి టీకా ఇస్తారు. వీరంతా దేశ వ్యాప్తంగా 22 కోట్ల మందికి పైగా ఉంటారని అంచనా. కరోనా పోరాటంలో ముందు ఉన్న వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 50 ఏళ్ల పైబడ్డవారికి ఆన్ లైన్‌లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పిస్తారు.
 
ఇందులో భాగంగా వ్యాక్సిన్ స్టోరేజ్ , పంపిణీ పై కేంద్రం గైడ్ లైన్స్ రిలీస్ చేసింది. మొదట హెల్త్ వర్కర్లకు తర్వాత ఫ్రాంట్ లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నారు. ఆ తర్వాత మూడవ రౌండ్ లో 50 ఏళ్ళు పై పడిన వారికి ఇతర జబ్బులు ఉన్న వారికి వ్యాక్సిన్ ఇస్తారు.

ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్బయించుకున్నారు నేరుగా సెంటర్ల దగ్గరకు వచ్చిన వారికి వ్యాక్సిన్ ఇవ్వకూడదని ఆదేశాలు ఇచ్చింది కేంద్రం.

వ్యాక్సిన్ సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టీకాలు ఇవ్వాలని కేంద్రం సూచించింది. టీకా తీసుకున్న తర్వాత ఎవరికైనా రియాక్షన్ అయితే వెంటనే చికిత్స అందజేసేందుకు వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని కోరింది.