శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (11:36 IST)

తృప్తి దేశాయ్‌కు చుక్కెదురు.. షిర్డీకి రావొద్దంటూ నోటీసులు.. వస్తే ఇక చర్యలే

షిరిడీ దేవాలయానికి వచ్చే భక్తులు.. ముఖ్యంగా మహిళలు సంప్రదాయ దుస్తులనే ధరించి రావాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి దేవాలయం వద్ద పోస్టర్లను కూడా ఏర్పాటు చేసింది కమిటీ. దీన్ని మహిళల అసమానతలపై పోరాడే ప్రముఖ సామాజిక కార్యకర్త తృప్తీ దేశాయ్ వ్యతిరేకించారు. డిసెంబర్ 10న తోటి మహిళా కార్యకర్తలతో సాయిబాబా ఆలయానికి వచ్చి ఆ పోస్టర్లు తొలగిస్తానని ప్రకటించారు. 
 
దీంతో షిర్డీ దేవాలయం సబ్ డివిజనల్ ఆఫీస్ తృప్తీ దేశా‌య్‌కు నోటీసులు పంపించింది. ఆమె ప్రకటించిని తేదీ దాటి 11వ తేదీ వరకూ ఆమెకు షిర్డీ దేవాలయానికి రావద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. కాదనీ వస్తే ఆమెను ఆలయంలోకి ప్రవేశించనివ్వమని తేల్చి చెప్పింది. ఆమె దేవాలయ ప్రవేశాన్ని నిషేధిస్తామని అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ ఆదేశాలను బేఖాతరు చేసి ఆమె ఆలయంలోకి ప్రవేశించాలని చూస్తే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.