గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (11:49 IST)

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. శాలరీలు అప్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీలు పెరగనున్నాయి. దీపావళి తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండోసారి శాలరీల పెంపు శుభవార్తను కేంద్రం నుంచి వినబోతున్నట్లు తెలిసింది. అదే నిజమైతే... 7వ పే కమిషన్ ప్రతిపాదనల ప్రకారం... ఈ జీతాల పెంపు ఉండనుంది. రిపోర్టు ప్రకారం... ఈ నెలాఖరున 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచిన శాలరీల ప్రకారం జీతాలు పొందనున్నారు. 
 
నెక్ట్స్ జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ జీతాల పెంపు అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోనుందని తెలిసింది. ఏడో పే కమిషన్ ప్రకారం... ఇండియన్ రైల్వేస్‌లోని నాన్ గెజిటెడ్ మెడికల్ స్టాఫ్ కూడా... రూ.21,000 వరకూ శాలరీల పెంపును పొందనున్నట్లు తెలిసింది. ప్రమోషన్లు కూడా ఉండనున్నట్లు సమాచారం.
 
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో తమ మినిమం శాలరీలను రూ.26,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారు నెలకు రూ.18,000 పొందుతున్నారు. ఫిట్‌మెంట్ కూడా పెంచాలని కోరుతున్నారు. ఈ క్రమంలో... రైల్వే శాఖ పెంపు దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిసింది.