శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (21:15 IST)

సన్నీలియోన్ పాటకు చిందేసిన వధువు.. నెట్టింట వీడియో వైరల్ (Video)

Mere Saiyaan Superstar
సన్నీలియోన్ పాటకు చిందేస్తూ పెళ్లి వేదికపైకి ఓ వధువు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వధువు సన్నీ పాటకు మామూలుగా డ్యాన్స్ వేయలేదు. అదరగొట్టేసింది. సాధారణంగా వధువును పెద్దలు వెంటపెట్టుకుని మండపంలోకి తీసుకువస్తారు. అయితే మహారాష్ట్రలో ఓ వధువు వెరైటీగా డ్యాన్స్ చేసుకుంటూ పెళ్లి వేదికపైకి వచ్చింది. 
 
బాలీవుడ్ నటి సన్నీలియోన్ నర్తించిన మేరే సైయాన్ సూపర్ స్టార్ క్రేజీ పాటకు చిందులేసింది. మరాఠి సాంప్రదాయం ప్రకారం ముస్తాబైన వధువు.. కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టి మండపంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ నుంచే సన్నీ పాటకు చిందేస్తూ.. వేదికపైకి వచ్చింది. దీంతో పెళ్లికి హాజరైన అతిథులంతా ఆమెను చూసూ వుండిపోయారు. 
 
చీర, ఆభరణాలు ధరించినా.. అదిరిపోయే స్టెప్పులతో.. రిథమిక్‌గా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ చేసింది. పలువురు ఆమె డ్యాన్సును వీడియో ద్వారా బంధించారు. చివరకు ఆ వధువు వరుడి వద్దకు చేరుకుని అతని చేతిపై ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ లుక్కేయండి.