శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 డిశెంబరు 2020 (14:11 IST)

ఎమ్మెల్సీ తాయిలం ప్రకటించిన తర్వాత శివసేనలో చేరిన 'రంగేలి' భామ

బాలీవుడ్ నటి ఊర్మిళ మతోండ్కర్. కాంగ్రెస్ పార్టీ పూర్వ మహిళా నేత. ఈమె శివసేన పార్టీలో చేరింది. మహారాష్ట్రలోని శాసన మండలిలో 12 నామినేటెడ్ పోస్టుల్లో ఆమె పేరును కూడా చేర్చిన తర్వాత, శివసేన సభ్యత్వం స్వీకరించింది. 
 
ఆ తర్వాత తనను 'సాఫ్ట్ పోర్న్‌స్టార్' అని గతంలో అభివర్ణించిన మరో నటి కంగన రనౌత్ వ్యాఖ్యలపై స్పందిస్తూ చురకలంటించారు. తానేమీ కంగన గురించి మాట్లాడేందుకు ఆమె అభిమానిని ఒక్క ముక్కలో చెప్పేశారు. 
 
"కంగన గురించి ఇప్పటికే చాలా మాట్లాడారు. ఆమెకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలని నేనేమీ భావించడం లేదు. ప్రతి ఒక్కరికీ విమర్శించే హక్కుంటుంది. ఆమెకూ ఉంది. నేను నేడు ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. నేను ఆమె గురించి నా ఏ ఇంటర్వ్యూలోనూ స్పందించలేదు" అని ఊర్మిళ వ్యాఖ్యానించారు.
 
కాగా, 2019లో కాంగ్రెస్ తరపున లోక్‌సభకు పోటీ చేసి ఓటమిపాలైన ఊర్మిళ, ఆపై ఉద్ధవ్ థాకరే అమలు చేస్తున్న పథకాలు, మహారాష్ట్ర అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించింది. నిన్న ఉద్ధవ్ నివాసమైన మాతోశ్రీలో ఊర్మిళ శివసేన కండువాను కప్పుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను కాంగ్రెస్‌ను వీడి 14 నెలలైందని అన్నారు. చాలామంది ఓ పార్టీని వీడిన గంటల వ్యవధిలోనే మరో పార్టీలో చేరుతారని, తానేమీ అటువంటి పని చేయలేదన్నారు.