హోంఐసొలేషన్‌లో ఎలాంటి మందులు వాడాలి?

corona
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (14:05 IST)
కరోనా వైరస్ ప్రతి ఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వైరస్ సోకిన ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా వైద్యం చేయించుకుంటున్నారు. అయితే, ఈ వైరస్‌పై ఫలానా మందు మర్థవంతంగా పని చేస్తుందని నిర్ధారణతో చెప్పిన దాఖలాలు ఇప్పటివరకు ప్రపంచంలోనే లేవు. ఆరంభంలో హైడ్రాక్సిక్లోరోక్విన్‌, పారాసిట్మాల్ మాత్ర అని.. ఇంకేదో అని వాడేస్తున్నారు. యాంటిబయాటిక్స్‌ కూడా విరివిగా వాడేస్తున్నారు.

ఇది ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. విటమిన్ల మాత్రలను కూడా చాలామంది వేసుకుంటున్నారు. వీటివల్ల పెద్దగా ఉపయోగాలుండవు. ఇక ఆయుర్వేదం అని, హోమియో అని కూడా వాడుతున్నారు. కర్పూరం, అల్లం, శొంఠి వంటి పదార్థాలను వడగట్టి పీల్చితే పోతుందని కూడా వాట్సాప్‌లో ప్రచారం జరుగుతున్నది. దీనివల్ల కూడా కరోనా తగ్గదు.

కరోనా అనేక రూపాంతరాలు చెందింది. అందరిపై ఒకేలా ప్రభావం చూపించడంలేదు. కరోనా సోకినవారు వైద్యులను సంప్రదించి మందులను వాడడం మంచిది. లేదంటే ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన మందులువాడాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు.దీనిపై మరింత చదవండి :