శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (12:21 IST)

కరోనావైరస్: మెంటల్ టెన్షన్ చంపేస్తోంది, ఈ వీడియో చూస్తే...

కోవిడ్ వచ్చిందనగానే చాలామంది ఆందోళనతో మానసికంగా కుంగిపోతున్నారు. కోవిడ్ రోగుల్లో మానసిక రుగ్మతలు తలెత్తుతున్నట్టు లాన్సెట్‌లో ప్రచురితమైన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది.

కరోనా వైరస్ బారినపడి, తిరిగి దాని నుంచి కోలుకున్న వారిలో నిద్రలేమి, యాంగ్జైటీ, డిమెన్షియా వంటి మానసిక సమస్యలు పెరుగుతున్నాయని ఈ అధ్యయనంలో తేలింది. కొవిడ్ బారినపడి కోలుకున్న 62,354 మంది ఆరోగ్య నివేదికలను సర్వే చేయగా, వారిలో ఇన్‌ఫ్లూయెంజా, ఫ్రాక్చర్ లేదా చర్మ సమస్యల వంటివికాకుండా మానసిక సమస్యలు అధికంగా పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. 
 
ముఖ్యంగా, వృద్ధులకే కాకుండా మధ్య వయస్కుల్లోనూ కొవిడ్ కారణంగా ఈ మానసిక సమస్యలు కనిపిస్తున్నాయని వెల్లడైంది. 65 ఏళ్లు దాటిన వారిలో డిమెన్షియా సమస్య మరీ దారుణంగా మారింది. ఇక యాంగ్జైటీ జబ్బుల్లో.. పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడం, పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్, అనవసర విషయాలకు భయపడటం వంటి మానసిక సమస్యలు ఎక్కువ మందిలో కనిపించాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. 
 
కొవిడ్ సోకడానికి ముందు ఏవైనా మానసిక సమస్యలు ఉన్నవారి పరిస్థితి కూడా విషమంగా మారిందని, వారిలో 65 శాతం మందికి సైకియాట్రిక్ జబ్బులు తప్పనిసరిగా వచ్చాయని వెల్లడైంది. క్లినికల్ రిపోర్టుల ద్వారా న్యూరాలజికల్, న్యూరోసైకియాట్రిక్ జబ్బుల గురించి యూకేకు చెందిన కొరోనర్వ్ గ్రూప్ అధ్యయనం చేస్తోంది. 
 
అంతేకాకుండా కొవిడ్ 19 కారణంగా చనిపోయిన వారి అటాప్సీలో కూడా మెదడు ఇన్ఫెక్షన్ ఆనవాళ్లు కనిపించినట్లు బ్రిటిష్ మెడికల్ జర్నల్ గత అక్టోబర్‌లో ప్రచురించింది. విషమంగా ఉన్న పేషెంట్లలో ల్యూకోఎన్‌సెఫలోపతీ, మైక్రో బ్లీడ్ సమస్యలు కనిపించినట్లు వైద్యుల రిపోర్ట్‌లు తెలిపాయి.