Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలని వేలాది మహామంత్రాలతో పండితులు

Written By జె
Updated: శుక్రవారం, 8 మే 2020 (22:18 IST)
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి మన నుండి వెళ్ళిపోవాలంటూ తిరుమలలో నిరంతరాయంగా యోగ వాశిష్టం.. ధన్వంతరి మహామంత్రం పారాయణం జరుగుతోంది. ఏప్రిల్ 10వ తేదీన ప్రారంభమైన ఈ పారాయణం నేటితో ముగిసింది. ప్రతిరోజు వేదపండితులు, గాయకులు పారాయణాన్ని నాదనీరాజనం వేదికపై పఠించారు.
 
సాక్షాత్తు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం ముందు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో నాదనీరాజన మండపంలో పారాయణం జరిగింది. ముగింపు కార్యక్రమానికి తిరుమల ప్రత్యేక కార్యనిర్వహణాధికారి ఎ.విధర్మారెడ్డి పాల్గొన్నారు. కరోనా వ్యాధి అరికట్టాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ వేదమంత్రాలను పఠించి వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చునని చెప్పారు. 
 
మానవాళికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ధన్వంతరి స్వామిని ప్రార్థిస్తూ ధన్వంతరి మహామంత్రం, మాంగళ్ళ వృద్థిని కోరుతూ లక్ష్మీదేవి మంత్ర పారాయణం, నవగ్రహ ప్రార్థన చేశామన్నారు. ఆ స్వామి వారి కృపా కటాక్షాలు మనపై ఎప్పుడూఐ ఉంటుందన్నారు తిరుమల ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి. 

అన్నీ చూడండి

Rakul Preet Singh: అందం, అహంకారం ఉన్న స్త్రీగా నటించడం గర్వంగా వుంది

Allari Naresh: రంభ ఊర్వశి మేనక స్టెప్ లేస్తే తెల్లారి వేడుక... సాంగ్ రిలీజ్

Nani: ఫోక్ మాస్ ఆంథమ్‌గా ది ప్యారడైజ్ సెకండ్ సింగిల్ డల్లాస్‌లో లాంచ్

Vishwak Sen : పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ LEGACY రాబోతోంది

స్కూల్ కు వెళ్లేప్పుడు చేసే సందడంతా సమ్మర్ హాలిడేస్ పాట

తర్వాతి కథనం
Show comments