మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: సోమవారం, 23 మార్చి 2020 (19:06 IST)

కరోనా వైరస్ పై ఉక్కుపాదం కోసం తెలుగు రాష్ట్రాలకు నితిన్ రూ. 20 లక్షలు

క‌రోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెరో రూ. 10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్రకటించారు హీరో నితిన్. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధంలో త‌న వంతు భాగ‌స్వామ్యం అందించాల‌ని హీరో నితిన్ నిర్ణ‌యించుకున్నారు. క‌రోనా క‌ట్ట‌డికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్త‌శుద్ధితో కృషి చేస్తున్నాయ‌ని ప్ర‌శంసించిన ఆయ‌న‌, రెండు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు. 
 
ఈ సంద‌ర్భంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి స‌హాయ నిధికి చెరో 10 ల‌క్ష‌ల రూపాయ‌ల విరాళాన్ని నితిన్ ప్ర‌క‌టించారు. మార్చి 31వ తేదీ వ‌ర‌కు ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌నీ, అంద‌రూ త‌మత‌మ ఇళ్ల‌ల్లోనే ఉండి, కోవిడ్‌-19 వ్యాప్తిని నిరోధించ‌డంలో పాలుపంచుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.