ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (18:14 IST)

బంగ్లాను చిత్తు చేసి సెమీస్‌లో అడుగుపెట్టిన ఆప్ఘన్.. స్వదేశంలో మిన్నంటిన సంబరాలు!!

afghanistan people
ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా, మంగళవారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌నును క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ చిత్తు చేసింది. ఈ విజయంతో ఆప్ఘాన్ జట్టు సెమీస్‌కు చేరింది. దీంతో స్వదేశంలో సంబరాలు మిన్నంటాయి. దేశంలోని ప్రధాన నగరాలైన కాబూల్, జలాలాబాద్ నగరాల్లో రోడ్లపైకి వచ్చిన ప్రజలు ఒకరినొకరు అభినందించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ మ్యాచ్ విజయంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఇంటి ముఖం పట్టాయి. పైగా, ఆప్ఘన్ జట్టు తొలిసారి ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్‌ సెమీస్‌కు చేరింది. 
 
నిజానికి ఆప్ఘాన్‌లో తాలిబన్ తీవ్రవాదులు తిరుగుబాటు, తాలిబన్ పాలన తర్వాత ఆ దేశంలో కల్లోలభరిత పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటిది ఈ విజయంతో ఆప్ఘాన్ దేశంలో సంతోషాల జల్లు కురిపించింది. రషీద్ ఖాన్ సేన సృష్టించిన చరిత్ర స్వేదేశంలో ఆప్ఘన్లను వీధుల్లోకి వచ్చి నాట్యం చేయించింది. రాజధాని కాబూల్, ముఖ్య నగరం జలాలాబాద్ వంటి నగరాల్లో ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి తమ క్రికెట్ జట్టు సాధించిన ఘనతను ఒక వేడుకలా జరుపుకున్నారు. 
 
ప్రధాన రహదారులపై ఇసుకేస్తే రాలనంతగా జనాలతో ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. తాలిబన్ పానలో ఉన్న ఆప్ఘాన్‌లో ఇలాంటి దృశ్యాలు కలలో కూడా ఊహించలేం. కానీ, వారి క్రికెట్ జట్టు హేమీహేమీ జట్లను ఓడించి వరల్డ్ కప్ సెమీస్ బెర్తును సాధించడం ప్రజల సంబరాలకు కారణంగా నిలిచింది. సోషల్ మీడియాలో ఇపుడు ఎక్కడ చూసినా ఆప్ఘాన్ ఆటగాళ్ల వేడుకలు, స్వదేశంలో వారి అభిమానుల సంబరాల తాలూకు ఫోటోలు, మీడియోలే దర్శనమిస్తున్నాయి.