1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 మే 2024 (14:26 IST)

కేకేఆర్ గెలుపు బెంగాల్ అంతటా సంబరాలు తెచ్చిపెట్టింది : సీఎం మమతా బెనర్జీ

ఐపీఎల్ 2024 సీజన్ టైటిల్ విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. దీనిపై వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ విజయం బెంగాల్ అంతటా సంబరాలు తెచ్చిపెట్టిందంటూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'ఈ యేడాది ఐపీఎల్ సీజన్‌లో రికార్డు స్థాయి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ఫ్రాంచైజీ.. ప్రతిఒక్కరికి నా వ్యక్తిగత అభినందనలు తెలియజేస్తున్నాను. రానున్న కాలంలో కూడా మరిన్ని అద్భుత విజయాలు సాధించాలని అభిలాషిస్తున్నాను' అంటూ ఆమె పేర్కొన్నారు.
 
కాగా, పదేళ్ల సుధీర్ఘ విరామం తర్వాత కేకేఆర్ జట్టు ఐపీఎల్ 2024 ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో ఆ జట్టు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అంతటా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ట్రోఫీ గెలిచిన ఆటగాళ్లను అభినందనలతో ముంచెత్తుతున్నారు. అలాంటి వారిలో సీఎం మమతా బెనర్జీ కూడా చేరిపోయారు. నైట్ రైడర్స్ సాధించిన విజయం బెంగాల్ అంతటా అంబరాన్ని తాకే సంబరాలు తెచ్చిపెట్టిందని వ్యాఖ్యానించారు.