సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మే 2024 (12:00 IST)

ఐపీఎల్ 2024 : ఎల్ఎస్‌జీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ హైలెట్స్!!

kkr team
ఐపీఎల్ 2024 సీజన్‌ పోటీల్లో భాగంగా, ఆదివారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 98 పరుగులతో పరాయజంపాలైంది. మొత్తం 81 పరుగులతో నరైన్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విజయానికి పునాదులు వేశారు. ఫలితంగా కేకేఆర్ జట్టు ఘన విజయం సాధించింది. నరైన్‌కు బౌలర్లు వరుణ్, రసెల్ కూడా అండగా నిలవడంతో ఎల్ఎస్ఓ మట్టికరిచింది. పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్‌‍కు తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ఎల్ఎస్ఓకి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నరైన్ 39 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. సాల్ట్ కూడా జట్టుకు శుభారంభాన్ని ఇచ్చాడు. సాల్ట్ తర్వాత రఘువంశీ అండగా నిలవడంతో నరైన్ బ్యాట్ నుంచి పరుగుల వరద కొనసాగింది. చివరకు బిష్ణోయ్ బౌలింగులో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రసెల్, రింకు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. తర్వాత కూడా స్థిరమైన భాగస్వామ్యాలు ఏవి కనిపించలేదు. చివరులో రమణ్ దీప్ సింగ్ మెరుపులతో కేకేఆర్ స్కోరు 235 పరుగులకు చేరింది.
 
ఆ తర్వాత భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ క్రమం తప్పక వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది. తొలి వికెట్ త్వరగా కోల్పోయినా స్థాయినిస్, రాహుల్ జోడీ గెలుపుపై ఆశలు రేకెత్తించింది. కానీ హర్షిత్ బౌలింగులో రాహుల్ పెవిలియన్ బాటపట్టడంతో ఎల్ఎస్ఓ పరిస్థితి గాడి తప్పింది. ఆ తర్వాత ఏ దశలోనూ ఎల్ఎస్ఓ బ్యాటర్లు పుంజుకోలేదు. క్రమ తప్పకుండా వికెట్లు కోల్పోయిన ఎల్ఎస్ఓ చివరకు పరాజయం పాలైంది. దీపక్ హుడా (5), స్టాయినిస్, పూరన్ (10), బదోని (15), టర్నర్ (16) వరుసగా పెవిలియను క్యూ కట్టారు. దీంతో 14 ఓవర్ల వద్ద 125/7 స్కోరుకు పరిమితమైంది. టెయిలెండర్లు అద్భుతాలేమీ చేయకపోవడంతో చివరకు ఓటమి చవి చూసింది.