గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 మార్చి 2023 (14:35 IST)

భార్యపై పొగడ్తల వర్షం కురిపించిన విరాట్ కోహ్లీ

virat kohli
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఒక తల్లిగా ఆమె ఎన్నో త్యాగాలు చేసిందని తెలిపాడు. కోవిడ్ సమయంలో అనుష్క శర్మ ఎలాంటి త్యాగాలు చేసిందో విరాట్ వివరించాడు. తమ కూతురు వామిక తమ జీవితంలోకి వచ్చాక తమలో చాలా మార్పులు వచ్చాయని తెలిపాడు. 
 
తనను చూసుకునే విషయంలో ఓ తల్లిగా అనుష్క చేసిన త్యాగాలు చాలా గొప్పవి. అనుష్క శర్మను చూస్తుంటే.. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొగలననే ధైర్యం వస్తుంది. 
 
జీవితం పట్ల ఆమె దృక్పథం చాలా భిన్నంగా వుంటుందని చెప్పాడు. ముఖ్యంగా లైఫ్‌లో ఏమి జరిగినా దానికి అంగీకరిస్తూ ముందుకు సాగిపోవడం తన నుంచే నేర్చుకున్నానని విరాట్ తెలిపాడు.