ఆదివారం, 1 అక్టోబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (16:23 IST)

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ

Kohli
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును భారత క్రికెట్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 25 వేల పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకు సచిన్ పేరిట ఉంది. ఇపుడు దీన్ని విరాట్ కోహ్లీ తన పేరును లిఖించుకున్నాడు.
 
ఢిల్లీ వేదికగా పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. 577 మ్యాచ్‌లలో సచిన్ 25 వేల పరుగులు చేయగా, విరాట్ కోహ్లీ కేవలం 549 మ్యాచ్‌లలోనే ఈ రికార్డును చేరుకున్నాడు. సచిన్ తర్వాత రికీ పాంటింగ్ 588 మ్యాచ్‌లు, జాక్వెస్ కల్లీస్ 594 మ్యాచ్‌లు, కుమార సంగక్కర 608 మ్యాచ్‌లు, మహేళ జయవర్థనే 701 మ్యాచ్‌లలో ఈ రికార్డును అందుకున్నారు.