అరుదైన రికార్డు సాధించిన అశ్విన్: అత్యంత వేగంగా 250 వికెట్లు
భారత్ వీర విక్రమ బౌలర్ అశ్విన్ రవిచంద్రన్ మరో రికార్డును సవరించాడు, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో ఏకైక టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో 250వ వికెట్ తీసిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో 35 ఏళ్లుగా అభేద్యంగా కొనసాగుతూ వచ్చిన డెన్నిస్ లిల్లీ రికార్డును ఛేదిం
భారత్ వీర విక్రమ బౌలర్ అశ్విన్ రవిచంద్రన్ మరో రికార్డును సవరించాడు, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో ఏకైక టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆటలో 250వ వికెట్ తీసిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్లో 35 ఏళ్లుగా అభేద్యంగా కొనసాగుతూ వచ్చిన డెన్నిస్ లిల్లీ రికార్డును ఛేదించాడు. అతి తక్కువ టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అద్వితీయ అటను ప్రదర్శించిన అశ్విన్ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు.
నాలుగోరోజు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (127 పరుగులు)ను ఔట్ చేసిన అశ్విన్ 30 ఏళ్లుగా కొనసాగుతున్న రికార్డును చెరిపివేశాడు. అత్యంత వేగంగా 250 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అశ్విన్ (45 టెస్టులు) నిలిచాడు. గతంలో ఆస్ట్రేలియా పేసర్ డెన్నిస్ లిల్లీ (48 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును అతను సవరించాడు.
భారత్ తరఫున 250 వికెట్లు తీసేందుకు కుంబ్లేకు 55 టెస్టులు పట్టా యి. అశ్విన్ టెస్టుల్లోకి అడుగు పెట్టిన దగ్గరి నుంచి అతనికంటే ఎక్కువ వికెట్లు కూడా ఎవరూ తీయలేకపోవడం విశేషం. 5 ఏళ్ల 95 రోజుల్లో అతను ఈ ఘనత సాధించాడు.
కాగా ఒకే టెస్టులో ఇరు జట్ల కెప్టెన్లు, వికెట్ కీపర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. కోహ్లి, సాహా, ముష్ఫికర్ ఈ మ్యాచ్‌లో శతకాలు బాదారు.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా బ్యాట్స్‌మన్ పుజారా మీడియాతో మాట్లాడాడు. బౌలర్ అశ్విన్ గురించి మాట్లాడుతూ పొగడ్తల్లో ముంచెత్తాడు. అతను ఒక బౌలర్‌గా మాత్రమే కాకుండా బ్యాట్స్‌మన్‌గా కూడా ఆలోచిస్తాడని చెప్పాడు. దీంతో బ్యాట్స్‌మన్ వీక్‌నెస్ తెలుసుకుని అద్భుతంగా బౌలింగ్ వేయగలడని చెప్పాడు పుజారా. భారత జట్టు సెకండ్ ఇన్నింగ్స్‌ను 159/4 వద్ద డిక్లేర్ చేసింది. అయితే ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ టాప్ ఆర్డర్ వికెట్లను తక్కువ పరుగులకే పడగొట్టాడు అశ్విన్. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌ను 3 పరుగులకు, మొమినల్ హక్‌ను 27 పరుగులకు ఔట్ చేశాడు.