సంబంధిత వార్తలు
- పింక్ బాల్ టెస్టు.. తొలి రోజు ఆట ముగిసింది.. హిట్ మ్యాన్‌పైనే భారం..
- #VaathiComing పాటకు స్టెప్పులేసిన టీమిండియా క్రికెటర్లు (Video)
- అశ్విన్ దంపతులకు ప్రభాస్ శుభాకాంక్షలు.. ఫ్లవర్ బొకే, గిఫ్ట్ హాంపర్ను..?
- 'స్పిన్నర్' అశ్విన్ కాదు.. చెపాక్ 'మాస్టర్' - పిక్ వైరల్
- ఇంగ్లండ్‌కు చుక్కలు చూపిన అశ్విన్ : చెన్నై టెస్టులో సెంచరీ
చరిత్ర సృష్టించిన అశ్విన్... 400 వికెట్ల క్లబ్‌లో చోటు
భారత స్పిన్నర్ రవిచంద్రన్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ వికెట్ తీయడంతో అశ్విన్ టెస్టుల్లో 400వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అశ్విన్ కేవలం 77 టెస్టుల్లోనే ఈ మైలురాయి అందుకున్నాడు.
కాగా, అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్టులో వికెట్ల పండగ నెలకొంది. స్పిన్నర్లకు ఇక్కడి పిచ్ స్వర్గధామంలా మారడంతో వికెట్లు టపటపా నేలరాలిపోయాయి.
ఫలితంగా ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. అత్యంత వేగంగా 400 వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా రికార్డు నమోదు చేశాడు.
వేగంగా 400 టెస్టు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ మొదటి స్థానంలో ఉన్నాడు. మురళీధరన్ 72 టెస్టుల్లోనే 400 మార్కు అందుకున్నాడు.
ఇప్పటిదాకా భారత్‌లో 400 పైచిలుకు వికెట్లు తీసింది అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (417) మాత్రమే. ఇప్పుడు అశ్విన్ కూడా వీరి సరసన చేరాడు.
