శనివారం, 28 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (22:09 IST)

ఆసియా కప్-వర్షంతో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు.. ఒక్క బంతి కూడా ఆడలేదు..

India_Pakistan
India_Pakistan
భారత్-పాకిస్థాన్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. వర్షం కారణంగా భారత్‌పై పాకిస్థాన్ లక్ష్యచేధనకు ఆలస్యం అయ్యింది. మైదానం కప్పబడి ఉండటంతో మ్యాచ్ ఓవర్లు కోల్పోయే అవకాశం ఉంది. పాకిస్తాన్ నుండి 20-ఓవర్ల లక్ష్యాన్ని చేధించేందుకు కట్-ఆఫ్ సమయం 10:27గా నిర్ణయించారు. అంతకుముందు భారత్ 266 పరుగులకు ఆలౌటైంది. 
 
హార్దిక్ పాండ్యా (87), ఇషాన్ కిషన్ (82) అర్ధసెంచరీలు చేసినప్పటికీ షాహీన్ అఫ్రిది నాలుగు వికెట్లతో భారత జట్టును ఆదుకున్నాడు. భారత్ ఒక దశలో 4 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది. అయితే హార్దిక్, కిషన్ మధ్య 138 పరుగుల భాగస్వామ్యం జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును నమోదు చేసింది. 
India_Pakistan
India_Pakistan
 
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ రోహిత్ తర్వాత నసీమ్ షా, హరీస్ రౌఫ్ తలో మూడు వికెట్లు తీశారు. అలాగే పాక్ బౌలర్ల షహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒక్క బంతి ఆడకుండా పాకిస్థాన్ వెనుదిరగాల్సి వచ్చింది.