సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 12 జులై 2019 (14:01 IST)

ఆ జ్యోతిష్యుడు చెప్పినట్టే భారత్ ఇంటికి.. క్రికెట్ విశ్వవిజేత ఎవరంటే?

ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా, సెమీ ఫైనల్ మ్యాచ్‌లు కూడా ముగిశాయి. తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను న్యూజిలాండ్ చిత్తు చేయగా, రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ - ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. అదేసమయంలో ఈ దఫా క్రికెట్ ప్రపంచ కప్‌ను కొత్త జట్టు కైవసం చేసుకుంటుందని ఓ జ్యోతిష్యుడు బాలాజీ హాసన్ చెపుబుతున్నాడు. 
 
పైగా, ఈ ప్రపంచ కప్ గురించి ఇప్పటివరకు అతను చెప్పినట్టే జరిగాయి కూడా. భారత్ సెమీ ఫైనల్‌కు చేరుకుని, ఇంగ్లండ్ లేదా న్యూజిలాండ్‌లతో తలపడుతుందని చెప్పారు. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయి ఇంటికి పోతుందని చెప్పాడు. కోహ్సీ సేన విషయంలో నిజంగానే అలానే జరిగాయి. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో కివీస్ జట్టు చేతిలో భారత్ ఓడిపోవడంతో 130 కోట్ల మంది భారతీయుల హృదయాలు భారంతో నిండిపోయాయి. అలాగే, ఈ ప్రపంచ కప్‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంటుందని చెప్పాడు. అలాగే, ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ అవార్డును అందుకుంటాడని జ్యోతిష్యుడు బాలాజీ హాసన్ చెపుతున్నాడు.