ఆదివారం, 26 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 జనవరి 2017 (11:50 IST)

అజారుద్దీన్‌కు షాక్.. మలుపులు తిరుగుతున్న హెచ్‌సీఏ రాజకీయం

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు గంటకో మలుపు తిరుతున్నాయి. భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ రాకతో వేడెక్కిన హెచ్‌సీఏ రాజకీయాలు రసపట్టుగా మారాయి. హెచ్.సి.ఏ అధ్యక్ష పదవికి అజారుద్దీ

హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) ఎన్నికలు గంటకో మలుపు తిరుతున్నాయి. భారత మాజీ కెప్టెన్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ రాకతో వేడెక్కిన హెచ్‌సీఏ రాజకీయాలు రసపట్టుగా మారాయి. హెచ్.సి.ఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్‌ నామినేషన్‌ చెల్లుతుందా లేదా అన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. 
 
హెచ్‌సీఏ అధ్యక్ష పదవికి అజారుద్దీన్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారి తిరస్కరించారు. అయితే ఇది వరకే హెచ్‌సీఏలో ఓటర్‌గా నమోదుకాని అజార్‌ నామినేషన్‌ చెల్లదంటూ ఒక వర్గం ఆరోపిస్తూ వస్తోంది. 
 
కానీ, తాను పోటీకి అర్హుడినంటూ అజర్‌ గురువారం పలు పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాడు. ఇవాళ ఎట్టకేలకు రిటర్నింగ్ అధికారి ప్రకటనతో హెచ్‌సీయూ వ్యవహారం కొలిక్కివచ్చినట్లయింది.