శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 8 మే 2017 (13:11 IST)

ఛాంపియన్స్ ట్రోఫీ: షమీ, ధావన్, రోహిత్ శర్మలకు స్థానం.. వికెట్ కీపర్‌గా ధోనీ

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా క్రికెటర్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఈ జట్టులోకి షమీని మళ్లీ తీసుకున్నారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు ఛాంపియన్స

ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే టీమిండియా క్రికెటర్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. ఈ జట్టులోకి షమీని మళ్లీ తీసుకున్నారు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలకు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కింది. కానీ గంభీర్, భజ్జీలకు భారత్ ఆడే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో స్థానం లభించలేదు. మహేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపర్‌గా జట్టుకు వ్యవహరించనున్నాడు. ఈ జట్టుకు అనిల్ కుంబ్లే కోచ్‌గా వ్యవహరిస్తారు. 
 
జట్టు వివరాలను పరిశీలిస్తే.. విరాట్ కోహ్లీ(కెప్టెన్), రహానె(వైస్ కెప్టెన్), రోహిత్‌, ధావన్‌, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీ, హార్థిక్‌ పాండ్యా, మనీశ్‌ పాండే, మహ్మద్‌ షమీ, అశ్విన్‌, భువనేశ్వర్, జడేజా, బూమ్రా, కేదార్‌ జాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌‌లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బరిలోకి దిగనున్నారు.