ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య కీలక పోరు నేడే..
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆసక్తికరమైన ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే మ్యాచ్ ఆదివారం జరుగనుంది. బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించే క్రికెట్ వార్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరేట్ అని ఇప్పటికే
భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆసక్తికరమైన ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే మ్యాచ్ ఆదివారం జరుగనుంది. బంతి బంతికీ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించే క్రికెట్ వార్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియానే ఫేవరేట్ అని ఇప్పటికే పలువురు క్రికెట్ దిగ్గజాలు అంచనా వేశారు. కోహ్లీ సారథ్యంలోని టీమిండియా టీమ్ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. పైగా ఐసీసీ నిర్వహించిన ఈవెంట్లలో పాకిస్థాన్‌పై భారత్ రికార్డే మెరుగ్గా ఉంది.
2012 టీ20 వరల్డ్ కప్ నుంచి 2016 టీ20 ప్రపంచ కప్ వరకు ఇరు జట్లు ఐదు సార్లు తలపడ్డాయి. అన్నింట్లోనూ భారత్‌నే విజయబావుటా ఎగురవేసింది. 2009 ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం పాక్ గెలుపొందింది. అయితే భారత జట్టు బలంగా ఉంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్, ధోనీలతో కూడిన బ్యాటింగ్ జట్టుకు ప్రత్యేక బలంగా నిలిచింది. పేస్ బౌలింగ్ విభాగం కూడా మునుపెన్నడూ లేనంత బలంగా ఉంది. ఇంగ్లండ్ పిచ్‌లు పేస్‌కు సహకరించనున్న నేపథ్యంలో, భారత్ నలుగురు పేస్ బౌలర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.